Posted on 2024-10-30 02:29:58
డైలీ భారత్, మహబూబాబాద్: స్థానిక జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎస్ జి ఎఫ్ ఐ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు. రాష్ట్రస్థాయి కి ఎంపికైన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో సెకండ్ ఇయర్ సిఈసి విద్యార్దిని డి. హరిక U/19 విభాగంలో 3000 మిటర్ల లో ప్రథమ స్థానం, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి B. సతీష్ U/19 విభాగం 3000 మిటర్ల లో ప్రథమ స్థానం సాధించి సరూర్ నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఏ. రామ్ దీక్షిత్ U/17 విభాగంలో బాస్కెట్ బాల్ లో కేసముద్రం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. అదే విదంగా జి. శ్రీ చరణ్ 9 వ తరగతి విద్యార్థి ఉర్షు విభాగంలో కేసముద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన విద్యార్దులను ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, ఫిజికల్ డైరెక్టర్ కె ఏస్ వర్మ , బాస్కెట్ బాల్ కోచ్ కుమార స్వామి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >