| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ పట్టణంలో దంపతుల హత్య ?

వేములవాడ పట్టణంలో దంపతుల హత్య ?

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం దంపతుల పై దాడి కలకలం రేపుతోంది. 

వేములవాడ పట్టణంలోని  26వ వార్డులో నివసిస్తున్న మామిడి మల్లయ్య దంపతుల మొదటి భార్య కొడుకు రాజు ఆస్తుల పంపకాల విషయంలో గొడవ పడ్డట్టు తెలుస్తుంది, 

దీంతో రాజు ఆవేశంతో మల్లయ్య ఆయన రెండో భార్య పై దాడికి పాల్ప డ్డాడు. దీంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందినట్లు తెలిసింది. 

ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన  వివాదమే ఈ హత్యకు కారణమని సమాచారం.. 

ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Previous నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
Next ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది
ADVERTISEMENT