| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో కర్ర సాము పై ఉచిత శిక్షణ"

"హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో కర్ర సాము పై  ఉచిత శిక్షణ"

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:బాలికలను తమ స్వీయ రక్షణలో వీర వనితలు గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కర్ర సాము శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు కుంగ్ ఫు మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల, ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు ఆదివారం రోజున ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ నందు ఇప్పటి వరకు నమోదు చేసుకున్న 56 మంది బాలికలు, వారి తల్లిదండ్రులతో ఉదయం పది గంటలకు  కార్యశాల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న బాలికలు 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉచిత శిక్షణ కోసం తమ వివరాలను 9666661254, 8801888805 నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.

గురువారం తేది 03-10-2024 నుండి కర్ర సాము శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Previous ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ
Next ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి : ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్
ADVERTISEMENT