డైలీ భారత్, చంద్రంపేట:యూత్ ఫర్ సేవ మరియు భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో గురువారం రోజున పాఠశాల విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్ మరియు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ బుక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ఎం శ్రీనివాస్ చేతులమీదుగా ఉచితంగా పంపిణిచేశారు . ఈ సందర్భంగా భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు మరియు శివ జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు గత ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం అక్కినపల్లి నాగరాజు మరియు శివజ్యోతిలను శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి.ఎం శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు కె.పద్మ, కె .రవి, అంజలి, ఎం.రమ జి. శ్రీనివాస్, వి.మధుసూదన్, హరిత రాణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.