డైరీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, " ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్" సిరిసిల్ల లో చాలా ఆనందోత్సవాలతో నిర్వహించడం జరిగింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రథమ సంవత్సరం విద్యార్థినిలను కళాశాల లోనికి ఆహ్వానిస్తూ ఇట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ G. వనజ కుమారి అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా ,శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం హాజరై ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న దురగతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,మొబైల్ ఫోన్లో మనకు అవసరం ఉన్న మంచి సమాచారాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలని, తమ పరిధికి మించి ఉపయోగించుకోరాదని, దాని పట్ల అనేక సమస్యలు వస్తాయని తెలిపారు. మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ రోజా మేడం మాట్లాడుతూ మహిళల మరియు బాలికల హక్కుల గురించి,చట్టాల గురించి తెలియచేసారు. కళాశాల ప్రిన్సిపాల్ మేడం వనజ కుమారి మాట్లాడుతూ "ముదితల్ నేర్వేగరాని విద్య కలదే ముద్దరా నేర్పించినన్" అని ఒక మహానుభావుడు అన్నట్లు మహిళలు నేడు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, విద్యార్థినులు చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, అమ్మాయిలు మొబైల్ ఫోన్ లకు బానిసలు కాకుండా మంచి క్రమశిక్షణతో చదివి భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినిల యొక్క నృత్య ప్రదర్శనలు కార్యక్రమాన్ని హోరెత్తించాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళీ,సీతారాము,శ్రీనివాస్,సునీత,ప్రవీణ్ కుమార్,నవీన్ కుమార్, అఫ్రోజ్ సుల్తానా, జబీఉల్లా,M.సునీత, గంగరాజు,భూపాల్,అనిత మరియు ఆఫీస్ సిబ్బంది,విద్యార్థినులు పాల్గొన్నారు.