| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరు ప్రయాణికులు మృతి

ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరు ప్రయాణికులు మృతి

డైలీ భారత్ హైదరాబాద్: విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

తెలిసిన వివరాల ప్రకారం  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యలగూడెం వద్ద ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న శ్రీకృష్ణ  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది. 

ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి. 

మృతులు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వారిగా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ సంఘటన సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Previous హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!
Next ఈ ఏడాది బతుకమ్మ పండుగ తేదీలు ఇవే
ADVERTISEMENT