| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుమారుని జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన తల్లిదండ్రులు

కుమారుని జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన తల్లిదండ్రులు

డైలీ భారత్, నర్సింహులపేట:మండలంలోని లలితండకు చెందిన గుగులోతు భీముడు - పద్మ కుమారుడు చంద్రకాంత్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా తమ కుమారుని 28వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ కుమారుని జ్ఞాపకార్థం సుమారు 200 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లు, పెన్నులు, నోట్ పుస్తకములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీముడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నా కుమారుడు అకస్మాత్తుగా మా నుండి దూరమై మమ్మల్ని ఒంటరివారిని చేసి వెళ్లిపోయాడని వాపోయారు. మా కుమారుడు జ్ఞాపకార్థం మా వంతు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక ఏఎస్ఐ వెంకన్న,  ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ గుగులోతు చంద్రకాంత్ ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి ఐకెపి ఉద్యోగులు సత్యనారాయణ, నరసయ్య, సమ్మయ్య, మల్సూర్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Previous పాముకాటు గురైన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలి : ABVP
Next ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా
ADVERTISEMENT