| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుల వివక్ష, కుల బహిష్కరణ కారకులను వెంటనే అరెస్టు చేయాలి...ఎమ్మార్పీఎస్ డిమాండ్

కుల వివక్ష, కుల బహిష్కరణ కారకులను వెంటనే అరెస్టు చేయాలి...ఎమ్మార్పీఎస్ డిమాండ్

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లాలో రోజురోజుకు దళితులపై అరాచకాలు పెరిగి పోతున్నాయని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ మండిపడ్డారు. జిల్లాలోని హవేళిఘణపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన మాదిగలను గ్రామంలోని వినాయకుని వద్ద కొబ్బరికాయ కొట్టనివ్వలేదని, అదేవిధంగా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మాదిగల మీద బోనాలపండుగ రోజు దాడి జరిగిందని, మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెం గ్రామానికి చెందిన మాదిగ కుటుంబం దప్పు కొట్టడం లేదని కుల బహిష్కరణ జరిగిందని ఆయన అన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో అధికారుల అలసత్వం కారణంగానే గ్రామాల్లో దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, కులబహిష్కరణలు పెరిగాయన్నారు. సంబంధిత అధికారులు బాధితులు ఫిర్యాదు చేయగానే స్పందించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. బాధితులకు అండగా నిలువాల్సిన అధికారులు రాజకీయ నాయకులు ప్రమేయంతో కేసులను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు స్పందించి దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన వారితోపాటు కుల బహిష్కరణకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులల్లో రాజకీయ నాయకులు తమ అధికార బలాన్ని ఉపయోగించి కేసులను నీరుగార్చే కుట్రలను తిప్పికొడుతామన్నారు. దళిత బాధితులకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని తెలిపారు.


బహిష్కరణ చేసి బోనాల పండుగ రోజున వారి వంతున వచ్చే మాంసము కుల పెద్దలు ఒక చెట్టుకు కట్టేసి వెళ్ళినారు బహిష్కరించిన ఇంటికి వెళ్లలేక చెట్టుకు వేలాడుతున్న మాంసం దృశ్యం

Previous గణేష్ నిమజ్జనానికి భారీ పోలీస్..
Next పెద్దపల్లి జిల్లా మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించిన: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
ADVERTISEMENT