Posted on 2024-09-09 13:52:45
డైలీ భారత్, వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతి తీర్థ మహా స్వాముల వారు,పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి స్వాముల వారి ఆజ్ఞను కోరిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సీఎంవో ఓఎస్డి వేముల శ్రీనివాసులు,ఆలయ అధికారులు బృందం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో శృంగేరి వెళ్లిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్,సీఎంవో ఓఎస్డి వేముల శ్రీనివాసులు , ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఆలయ అధికారుల, అర్చకుల బృందం
రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం,
దక్షిణ కాశీగా పేరుగాంచిన, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు,ఆలయ విస్తరణ పనులను ప్రారంభించడానికి శృంగేరి పీఠం వారి అనుమతులకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సీఎంవో ఓఎస్డి వేముల శ్రీనివాసులు, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి బృందం సోమవారం శృంగేరి పీఠం సందర్శించారు.
రెండు మసాలా క్రితం ప్రభుత్వ విప్ శృంగేరి పీఠన్ని సందర్శించి ఆలయ విస్తరణ పై చర్చించినపుడు ఆలయా నమూనా తో రావాలని శృంగేరి పీఠాధిపతి తెలుపగా ప్రభుత్వ విప్ బృందం సోమవారం శృంగేరి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతి తీర్థ మహా స్వాముల వారికి,పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారికి ఆలయ విస్తారణ నమూనాలను చూపెట్టి వారి సూచనలు సలహాల అనుగుణంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపట్టడం కోసం ఆజ్ఞను కోరారు..
శృంగేరి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతి తీర్థ మహా స్వాముల వారు,పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారు పలు సందేహాలకు తగు సూచనలు సలహాలను ఇస్తూ, శుభమని తెలియజేస్తూ ఆలయ విస్తరణకు ముందుకు వెళ్లాలని మౌఖికంగా ఆదేశాలించారు.. త్వరలోనే శ్రీశ్రీశ్రీ జగద్గురులు శ్రీ రాజరాజశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని ఇతరత్ర అభివృద్ధి పనులకు అక్కడికక్కడే తగు సూచనలు సలహాలు ఇస్తానని పేర్కొన్నారు..
శృంగేరి శ్రీశ్రీశ్రీ జగద్గురులు భారతి తీర్థ స్వామి వారిని శ్రీ రాజరాజశ్వర వారి ఆలయానికి రావలసిందిగా విజ్ఞప్తి చేశారు...
ఆలయ అభివృద్ధిలో ముందడుగు
ఒక వైపు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో రూ. 50 కోట్లు మంజూరు అయ్యాయని, ఇప్పుడు ప్రభుత్వ విప్,అధికారుల బృందం శృంగేరి వెళ్లడంతో ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రజలు, రాజన్న భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శారద మాత అమ్మవారి దర్శనం
శృంగేరి పీఠంలోని శ్రీ శారదాంబ అమ్మవారిని ప్రభుత్వ విప్,అధికారుల బృందం వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సీఎంవో ఓఎస్డి వేముల శ్రీనివాసులు తో పాటు ఆలయ ఈ.వో వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లీనాయకం,శృంగేరి పీఠం తెలంగాణ భాధ్యులు శ్రీ రాధాకృష్ణ , రాజన్న ఆలయ ఈ ఈ రాజేష్, ఆలయ ప్రధాన అర్చకులు నమలికొండ ఉమేష్ శర్మ, చంద్రగిరి శరత్ శర్మ,డి ఈ రఘునందన్, అసిస్టెంట్ స్థపతి గణేష్ ,ఇంజనీర్ అసిస్టెంట్ జి అంజయ్య తదితరులు ఉన్నారు...
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >