| Daily భారత్
Logo




మరో ఉద్యమానికి సేవలాల్ సేన సమాయత్తం : సేవాలాల్ సేన రాష్ట్ర బాధ్యులు

News

Posted on 2024-09-09 12:38:36

Share: Share


మరో ఉద్యమానికి సేవలాల్ సేన సమాయత్తం : సేవాలాల్  సేన రాష్ట్ర బాధ్యులు

డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ గిరిజన సంక్షేమ భవన్ లో సేవాలాల్ సేన 10 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. మొదట మేరమ్మ యాడికి, సేవా లాల్ మహారాజ్ కి పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా యువసేన అధ్యక్షులు భరత నాయక్, పరమేష్ నాయక్ ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు సపావత్ బాలకృష్ణ చౌహాన్ ( టీటీఎఫ్ ), కేటీపీఎస్ గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి దుర్గా ప్రసాద్ నాయక్, జిల్లా అధ్యక్షులు మాలోతు శివ నాయక్ లు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ... సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ నాయక్ నాయకత్వంలోఅనేక సమస్యలపై పోరాటాలు చేసి,  పట్టుదలతో విజయాలను  సాధించుకోవడం జరిగిందన్నారు. జాతిని ఏకతాటిపై తెచ్చి, హక్కులు, చట్టాలను కాపాడుతామని శపధం చేశారు. గిరిజన జాతి మహిళలకు రక్షణ కల్పించడంలో తమ సంఘం ప్రధాన భూమిక పోషిస్తుందని తెలిపారు. భూక్య సంజీవ నాయక్ నేతృత్వంలో 2015 లో ఏర్పడ్డ సేవాలాల్ సేన ఈ దశాబ్ద కాలంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ 9 న సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు.


కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి గూగుల్ చంద్ర నాయక్, రైతు సేన జిల్లా అధ్యక్షుడు పపావత్ రాందాస్ నాయక్, యువసేన జిల్లా అధ్యక్షులు భరత్ నాయక్, మహిళా అధ్యక్షురాలు రుకుమని భాయ్, గంశి బాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల లచ్చు నాయక్, ఉద్యోగ సేన జిల్లా అధ్యక్షుడు ఫుల్ సింగ్ నాయక్,  విష్ణు నాయక్, ఉపాధ్యక్షులు బట్టు హుస్సేన్ నాయక్, రాజు నాయక్, విద్యార్థి విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ నాయక్, విజయ్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షుడు పరమేష్ నాయక్ లు పాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >