Posted on 2024-09-08 16:12:12
కారు, ద్విచక్ర వాహనం సీజ్ ఇద్దరు అరెస్ట్
కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడులో సీసీఎస్ పోలీసులు, జూలూరుపాడు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 80 లక్షల విలువ కలిగిన 256 కేజీల గంజాయిని తరలిస్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ విలేకరులకు వెల్లడించారు. కారులో హైదరాబాదుకు గంజాయిని తరలిస్తున్న శివశంకర్ రెడ్డి, నాగేంద్రబాబులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని తెలిపారు. గంజాయి విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుందని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ లను ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయిని అమ్మినా, అమ్మడానికి సహకరించినా, ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. సమావేశంలో సిఐ ఇంద్రసేనారెడ్డి, si రాణా ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >