| Daily భారత్
Logo




తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లు బదిలీ..

News

Posted on 2024-09-07 20:25:35

Share: Share


తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లు బదిలీ..

HYD CPగా మళ్లీ సీవీ.ఆనంద్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: పండుగపూట రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.వినాయకచవితి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ కేడర్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్‌కు బదిలీ చేస్తూ ఆయనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు అప్పగించారు. అలాగే మరోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ భగవత్‌కు పోలీస్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం. రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్.. విజయ్ కుమార్‌కు ఏసీబీ డీజీగా కొత్త బాధ్యతలు అప్పగించారు.

కాగా.. సీపీ ఆనంద్ ఇంతకు ముందు కూడా హైదారాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నగరంలో డ్రగ్స్ దందాపై కీలక దృష్టి పెట్టిన ఆయన క్రైం రేటును తగ్గించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాంటి అధికారి మళ్లీ పీసీగా రావడంతో ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >