డైలీ భారత్, ముంబై: ముంబై కమలా మిల్స్ కాంపౌండ్ ఏరియాలోని 15 అంతస్తుల టైమ్స్ టవర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 8 ఫైరింజన్ల సాయంతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కమలా మిల్స్ ఏరియాలోని ఓ రెస్టారెంట్లో 2017 డిసెంబర్ 29న జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
#fire accident #mubai #times tower