Posted on 2024-07-26 11:30:10
రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి
షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బడ్జెట్ పత్రాలను దగ్ధం చేస్తూ నిరసన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంకు ప్రవేశపెట్టిన 2,91,159 కోట్ల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని,బడ్జెట్ ను సవరించి 5శాతం నిధులు కేటాయించాలని,నిధులు కేటాయించక పోవడన్ని నిరసిస్తూ షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట దివ్యంగుల ఆద్వర్యంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జెఎస్పి పార్టీ నాయకులు మర్ల ఆంజనేయులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 6 గ్యారంటీ లలో 6000 పింఛన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి అందలం ఎక్కాక దాని పెన్షన్ల పెంపు ఊసు ఎత్తడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో 137 అంశాలను అసెంబ్లీలో మాట్లాడారు. ఎక్కడ కూడా వికలాంగుల సంక్షేమం కోసం ప్రస్తావించలేదు. 12.02శాతం ఉన్న వికలాంగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థం అవుతుంది. పంచాయతీ రాజ్, గ్రామీణఅభివృద్ధి శాఖకు 29816 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో ఆసరా పెన్షన్స్ పెంపు ఎట్లా సాధ్యం.వికలాంగుల పెన్షన్ 6000లకు, ఇతర పెన్షన్ 4000 లకు పెంచేందుకు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. వికలాంగుల రుణాలు, సహాయ పరికరాలు, స్కాలర్ షిప్స్ వంటి వాటికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అభయ హస్తం 6 హామీలలో చేయూతకు నిధులు ఎందుకు కేటాయించలేదు. ఆదాయాన్ని తగ్గించుకునేందుకు సంస్కరణలు అమలు చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పడం అంటే సంక్షేమ పథకాలను రద్దు చేయాలనే కుట్ర దాగి ఉంది. ప్రజా పంపిణి వ్యవస్థకు 3836 కోట్లు కేటాయించారు.దీనితో వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వడం ఆచరణలో సాధ్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వైఖరి మార్చుకొని పునరాలోచన చేయాలన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చేగురు శేఖర్ గౌడ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మహిళ నాయకులు అబ్బే సంతోష, కుసుమ, మనీలా, మల్లేష్, నర్సింలు, బాల్రాజ్, ఆంజనేయులు, ఎండి మస్కుద్ తదితరులు పాల్గొన్నారు..
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >