| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

బెంగళూరు: విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ ఇక్కడి వచ్చిన సంగతి తెలిసిందే..

ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌ నినాదం ఇచ్చారు. "చంద్రుడిపై మన ల్యాండర్‌ దిగినప్పుడు భారత్‌లో నేను లేను. ఆ అద్భుత క్షణాలను విదేశాల నుంచి చూశా. అప్పుడే నేరుగా బెంగళూరుకు రావాలని అనుకున్నా. భారత్‌ రాగానే శాస్త్రవేత్తలను కలుసుకొని అభినందించాలనుకున్నా. ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతగా ఉన్నా" అని మోదీ వెల్లడించారు.

అనంతరం విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి మోదీ వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు..

Previous మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు
Next 1523 ప్రత్యేక అవసరాల టీచర్‌ పోస్టులు: శాశ్వత ప్రతిపాదికన నియామకం
ADVERTISEMENT