| Daily భారత్
Logo




డెలివరీ బాయ్‌ ముసుగులో డ్రగ్స్‌ సరఫరా

News

Posted on 2024-07-24 10:31:31

Share: Share


డెలివరీ బాయ్‌ ముసుగులో డ్రగ్స్‌ సరఫరా

డైలీ భారత్, హైదరాబాద్‌: డెలివరీ బాయ్‌ ముసుగులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిని టీజీ న్యాబ్‌, మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 22.5 కేజీల గంజాయి, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్‌, 71 నైట్రోజన్‌ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన షేక్‌ బిలాల్‌(28) ఇంటర్‌ చదివే సమయంలోనే గంజాయికి అలవాటు పడ్డాడు. కరోనా తర్వాత హైదరాబాద్‌ మాదాపూర్‌ ఇజ్జత్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ పాత పరిచయాల నేపథ్యంలో అరకు నుంచి గంజాయి తెచ్చి దాదాపు 40.. 50 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు భాను తేజ జైలులో ఉన్నాడని, అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తామని డీసీపీ తెలిపారు.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >