విలువ లేని చోట రాజేష్ చేసిన పనులు శూన్యం
డైలీ భారత్, నర్సింగ్ ప్రతినిధి: మెదక్ జిల్లా నార్సింగ్ బి ఆర్ఎస్ పార్టీ నర్సింగి మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన మాజీ నార్సింగి పార్టీ ఇంచార్జ్,మాజీ టెలీకామ్ బోర్డు మెంబర్, న్యాయవాది అంచనూరి రాజేష్ ......
2004 నుండి పార్టీ లో టిఆర్ఎస్వి నార్సింగి గ్రామ శాఖ, టిఆర్ఎస్వి చేగుంట మండల శాఖ అధ్యక్షుడిగా,2009 లో ఉమ్మడి మెదక్ జిల్లా టి ఆర్ ఎస్ వి ప్రధాన కార్యదర్శిగా,2015 లో టెలీకామ్ బోర్డు మెంబర్ గా,2018 జనరల్ ఎలక్షన్స్ నార్సింగి ఇంచార్జ్ గా,ప్రస్తుతం మండల బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రాజేష్ ఇటీవల సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం కోల్పోయిన నుండి,ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలకు మండల పార్టీలో నెంబర్ 2 అయినా నాకే సమాచారం ఇవ్వకపోవడం,ఇటీవల జరిగిన పార్టీ సభలల్లో కూడా కావాలని చివరికి పిలవడం అవమానించేలా ప్రవర్తిస్తున్నారు,అలాగే ధర్నా,ఆందోళన లాంటి కార్యక్రమలకు మాత్రం పిలవడం జరుగుతుంది,గతంలో ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు చిన్న వయసులోనే జైలు కూడా వెళ్లడం జరిగింది కావున మాలాంటి సీనియర్,ఉద్యమ నాయకులకే ఇలా అగౌరవ పరిస్తే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి,పార్టీలో ముఖ్యమైన పదవి లో ఉన్న కూడా విలువ లేనపుడు,అందుకే నేను కూడా ఇప్పటి నుండి సామాన్య కార్యకర్త ఉంటానని నా యొక్క మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నను,నాలా రాజీనామా చేయడానికి చాలా మంది ఉన్నారు,కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు,గతంలో కూడా ఎమ్మెల్యేకి మాజీ ఎంపీ గా ఉన్నపుడు నాకు టెలీకామ్ బోర్డు మెంబర్ గా మొట్ట మొదటి అవకాశం నాకు ఇచ్చారు,ఈ మండల పార్టీ పదవి ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే కి నా వంతు వారి ఎలక్షన్స్ లో మనస్ఫూర్తిగా పని చేశా, ఎమ్మెల్యే నాకు ఇచ్చిన గౌరవం ను నా జీవితాంతం మరువలేను, దుబ్బాక ఎమ్మెల్యే కి ధన్యవాదములు,కానీ ఎమ్మెల్యే మంచితనాన్ని ఆసరాగా తీస్కొని, దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన ఆదేశాలను తప్పుదోవ పట్టిస్తున్న మండల పార్టీ బాధ్యులు,అసలు నార్సింగి గ్రామ కమిటీ అయితే ఉందా,లేదో,పనిచేస్తుందా కూడా తెలియదు,మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా వీళ్ల వైఖరి వల్ల కొంత మంది ముఖ్యమైన పదవులున్న ఉద్యమ నాయకులు పార్టీ నుండి వెళ్లిపోయారు, కావున ఇలాంటి వారిని మార్చి పార్టీ ని కాపాడాలని ఎమ్మెల్యే కి మనస్ఫూర్తిగా వేడుకుంటు నా రాజీనామాను అమోదించాలని కోరుతున్నాను