మాజీ తాజా గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అభినందనలు వెల్లడి
చందాయి పేట గ్రామాని చరిత్రలో లిఖించబడింది
చందాయి పేట గ్రామం దేశానికి పరిచయం చేసినా దండు విజయ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం గ్రామస్తులు తరఫున తాజా మాజీ సర్పంచ్ ఆనందం తెలిపారు
డైలీ భారత్, చేగుంట ప్రతినిధి: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామానికి చెందిన దండు విజయ(Asst.Prof) w/o రాజు , ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాని పొందింది. సైన్స్ కళాశాలలోని ఆస్ట్రానమీ సబ్జెక్టులో ఫోటో మెట్రిక్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్ ఆఫ్ బీటాలైరే టైప్ బైనరీ సిస్టమ్స్ యూజింగ్ స్పేస్ అండ్ గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్" అనే అంశం పైన ప్రొఫెసర్ K. శ్రీరామ్ ఆధ్వర్యంలో పరిశోధన పూర్తి చేసినందుకుగాను గురువారం రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను పొందింది. ఈ సందర్భంగా విజయని సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ,డైరెక్టర్, ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ హెడ్, ఫ్రెండ్స్, స్థానిక తాజా మాజీసర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మరియు ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, వార్డు సభ్యులు కోఆప్షన్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.