డైలీ భారత్, న్యూ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ శుక్రవారం ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది.
సాయంత్రం 5గంటల వరకు 59.7% పోలింగ్ నమోదై నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.
ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణా చల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే..