| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

14 సంవత్సరాల లోపు పిల్లలందరు చదువుకోవాలి : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మౌనిక

14 సంవత్సరాల లోపు పిల్లలందరు చదువుకోవాలి : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మౌనిక

డైలీ భారత్, మహబూబాబాద్: 14 సంవత్సరాల లోపు పిల్లలందరు తప్పకుండా  చదువుకోవాలని, వారు పనిలో కాకుండా పాఠశాలలో ఉండాలని,అలాయితేనే అంబేద్కర్ కలలుకన్న  భారతదేశం సాక్షాత్కరిస్తుందని, బావి భారత పౌరులైన చిన్న పిల్లలకు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించ బడ్డాయని అందులో చూపించ బడిన హక్కులన్ని అందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందు తుందని ఈరోజు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మహబూబాబాద్ వారి ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సమీపంలోని ఆశాభవన్ మరియు వేర్పుల సత్యం కాలనీలో గల  దైవకృప అనాధ పిల్లల శరణాలయాల్లో  భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్జి పిల్లలకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. 

 ఈ కార్యక్రమంలో స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అరుణ,కోర్ట్ లైజన్ ఆఫీసర్, సంపత్ రెడ్డి, కోర్ట్ కానిస్టేబుల్ రాంబాబు అనాద శరణాలయాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Previous సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా విశ్వరూప్
Next ఎన్‌ఐఏ కస్టడీలో బెంగళూరు బ్లాస్ట్‌ నిందితులు!
ADVERTISEMENT