| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేతన్నలను ఆదుకోవాలి : బండి సంజయ్

నేతన్నలను ఆదుకోవాలి : బండి సంజయ్

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకోవాలి    

సిరిసిల్లలో దీక్ష చేపడతాను

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి  నివాళులర్పించి, లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన బండి సంజయ్.


ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిలేక లక్ష్మినారాయణ ఆత్మహత్య చేసుకున్నాడనీ అన్నారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే, నేతన్నలను ఆదుకోవాలని ఎవరికి లేదన్నారు.

నేతన్నలు పని కల్పించాలని రొడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి పాత బకాయిలు చెల్లించి, కొత్తగా బతుకమ్మా చీరల ఆర్డర్ లు ఇవ్వాలనీ అన్నారు.

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలనీ అన్నారు.

వర్కర్ టు ఓనర్ పథకం అన్నారు, అది ఏక్కడికి పోయిందో ఎవరికి తెలియదనీ అన్నారు.

అందరు కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంకు పరిష్కారం చూపించడానికి ముందుకు రావాలనీ అన్నారు.

ప్రభుత్వం, పాలకుల్లో చలనం లేదు, వారి దృష్టికి తీసుకుని రావడానికి సిరిసిల్లలో దీక్ష చేపడతాననీ అన్నారు.

Previous మార్కెట్ లో కి ఆయుర్వేద లిక్కర్
Next బాధిత కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ADVERTISEMENT