| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేను పక్కా లోకల్ కల్వకుర్తి శేరి అప్పరెడ్డిపల్లిలో పుట్టిన ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వంశీచంద్ రెడ్డి

నేను పక్కా లోకల్ కల్వకుర్తి శేరి అప్పరెడ్డిపల్లిలో పుట్టిన ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వంశీచంద్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నేను పక్కా లోకల్ కల్వకుర్తి శేరి అప్పరెడ్డిపల్లిలో పుట్టిన ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను అని మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి చల్ల వంశీచంద్ రెడ్డి అన్నారు.శనివారం విలేకర్ల సమావేశంలో వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ నాకు మహిళలంటే అత్యంత గౌరవం, రాజకీయాల్లోకి వ్యక్తి జీవితం తీసుకురావడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు...డీకే అరుణ తాను నన్ను ఎమ్మెల్యే చేసిందన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా. నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ,గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలు, గెలిపించుకుంది కల్వకుర్తి ప్రజానీకం. అంతే కానీ అరుణమ్మ విజ్ఞత లేకుండా మాట్లాడొద్దు.. 2009-2014 లో  ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యునిగా నేను సిఫార్సు చేస్తేనే నీకు టికెట్ వచ్చిన విషయం మర్చిపోయారా...గద్వాల్ లో నీ కుటుంబ ప్రయోజనాల కోసం నీ అల్లున్ని ఎమ్మెల్యే చేయడానికి ఒక బీసీ బిడ్డను బలి పశువును చేసింది...మక్తల్  భాజాపా అభ్యర్థిని కాదని నీతమ్ముడికి అనుకూలంగా వ్యవహరించింది వాస్తవం కాదా...2014లో నా ఓటమికి డీకే అరుణ శతవిధాలుగా ప్రయత్నం చేసినా ఆ కుట్రలన్నిటిని చేదించి కల్వకుర్తి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించా...డీకే అరుణ కాంగ్రెస్ లోకి రాక మునుపే నేను కాంగ్రెస్ పార్టీలో అప్పటికే సీనియర్ ని...

నేను 2006లో ఏఐసీసీ మెంబర్ గా ఉంటే, మీరు 2014లో ఏఐసీసీ మెంబర్ అయ్యారు...నేను జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శి గా ఉన్నపుడు మీరు రాష్ట్రంలో పీసీసీ ఉపాధ్యక్షులు..డీకే అరుణది పూటకో పార్టీ మారే అవకాశవాద రాజకీయం. నాది, ఎంత కష్టం వొచ్చినా, నష్టం వొచ్చినా నమ్మిన సిద్ధాంతం, పుట్టిన పార్టీకి కట్టుబడే విలువల రాజకీయం. నన్ను నాన్-లోకల్ అంటున్నారు కదా, మీరు ఏ స్థానికత ప్రాతిపదికన పాన్ గల్ నుండి జెడ్పిటిసి గా పోటీ చేశారు...నేనే పక్కా లోకల్ కల్వకుర్తి శేరి అప్పరెడ్డిపల్లిలో పుట్టిన ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను...నేను నాన్-లోకల్ అయితే గుజరాత్ కు చెందిన నరేంద్ర మోడీ వారణాసి నుండి, హుజారాబాద్ వాస్తవ్యుడైన ఈటెల మల్కాజ్ గిరి నుండి ఎలా పోటీ చేస్తారు...ఈ విషయంలో డీకే అరుణ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి...పాలమూరు లో మైన్ మాఫియా,వైన్ మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, క్రషర్ మాఫియా లను నెలకొల్పడానికి మళ్ళీ భాజాపా నుండి పోటీ చేయడానికి వచ్చారు..నా తల్లి గారి ఊరు నారాయణపేట అని చెప్పుకునే మీరు మీ ప్రాంతానికి ఏం చేశారు...నారాయణపేట కు మంజూరైన సైనిక్ స్కూల్ ను వేరే రాష్ట్రానికి తరలిస్తే ఎందుకు అడ్డుకోలేదు...వేముల రోడ్డు,మహబూబ్ నగర్-భుత్పుర్ మధ్యన బ్రిడ్జి ల నిర్మాణాలను ఎందుకు చేపట్ట లేదు...ధన్వాడ బిడ్డను అని చెప్పుకునే మీరు తీలేరు నుండి కేవలం 6కి.మీ. కాల్వ తవ్విస్తే దన్వాడ పెద్ద చెరువుకు నీల్లొచ్చే అవకాశం ఉన్నా  మంత్రి హోదాలో ఎందుకు ఆ పని చేయలేక పోయారు...నడిగడ్డ ప్రాంతపు 80వేల ఎకరాలు బీడుగా మార్చే అప్పర్ భద్ర పెంపును డీకే అరుణ ఎందుకు అడ్డుకో లేకపోయారు....ఆర్డీఎస్ కేటాయింపులు 

15టీయంసీలు,కేవలం 4టీయంసీలు పారుతుంటే మంత్రిగా అప్పట్లో మీరేం చేశారు. కుసంస్కార రాజకీయాలు చేయడం ఇప్పటికైనా మానుకోండి..వంశీచంద్ రెడ్డిని ఎలాగైనా ఓడగొట్టలనే  డీకే అరుణమ్మ నా పై దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారు...నిన్న నన్ను నాన్-లోకల్ అని అనడం తోనే డీకే అరుణ తన  రాజకీయ జీవితానికి మరణ శాసనం తానే లిఖించికున్నారు...నా వ్యాఖ్యల పై ఎవ్వరు బహిరంగ చర్చకు వచ్చినా నేను సిద్ధమే...

Previous ఉత్తంకుమార్ రెడ్డితో భేటీ అయిన ఆది శ్రీనివాస్
Next బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
ADVERTISEMENT