Posted on 2024-02-28 13:47:18
డైలీ భారత్, వేములవాడ: ఈ సందర్భంగా సి.ఐ కరుణాకర్ మాట్లాడుతూ...బోయినపల్లి గ్రామానికి చెందిన పెగ్గెర్ల చంద్రశేకర్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా వేములవాడ పరిధిలోని కోనైపల్లి గ్రామంలో ఆఫీస్ పెట్టుకొని ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం గల్ఫ్ దేశాలకు పంపుతానాని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వారిని గల్ఫ్ దేశాలకు పంపకుండా మోసాలకు పాల్పడుతున్నారు. కొనరాపేట మండల కొండాపూర్ గ్రామానికి చెందిన మల్యాల దుర్గయ్య అనే వ్యక్తి ని ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్ దేశానికి పంపిస్తా అని నెలకు లక్ష జీతం అని నమ్మించగా ఉక్రెయిన్ దేశానికి పంపించడానికి 2,75,000/- రూపాయలు ఖర్చు అవుతుందని అవి కట్టిన నెల రోజుల లోపు ఉక్రెయిన్ దేశానికి పంపిస్తా అని చంద్రశేఖర్ మాల్యాల దుర్గయ్య ని నమ్మించగా దుర్గయ్య చంద్రశేఖర్ కి 2,75,000/- కట్టగా ఎలాంటి 2 సంవత్సరాల నుండి ఉక్రెయిన్ దేశానికి పంపకుండా అడిగిన ప్రతిసారి మాట దాటవేస్తుండగా దుర్గయ్య వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వేములవాడ టౌన్ పోలీస్ వారు చీటింగ్ మరియు ఇమ్మిగ్రేషన్ ఆక్ట్ లో కేసు నమోదు చేసి నమ్మదగని సమాచారం మేరకు ఈ రోజు చంద్రశేఖర్ ని జగత్యాల బస్సు స్టాప్ వద్ద పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని టౌన్ సి.ఐ కరుణాకర్ తెలిపారు.
ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి.
నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు, కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల నుండి గల్ఫ్ కు ఉపాధి నిమిత్తం వెళ్ళేవారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏజెంట్లను సంప్రదించి ఉపాధి అవకాశాలను పొందాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు,నకిలీ గల్ఫ్ ఏజెంట్ల సమాచారం ఉన్న వారు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ 8712656411 అనే నెంబర్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు.అంతే కాకుండా ఉపాధి,ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేవారు జిల్లాలోని ఏజెంట్లను సంప్రదించే ముందు వారికి సంబంధించిన పూర్తి వివరాలు అనగా ప్రభుత్వ ఏజెంట లేదా నకిలీ ఏజెంట అతని మీద ఎలాంటి కేసులు ఉన్నాయా మొదలగు సమాచారం ఈ నెంబర్ ద్వారా తెలులుకోవచ్చు అని అన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >