Posted on 2024-02-26 17:37:14
డైలీ భారత్, హైదరాబాద్: టీఎస్ఎండీసీతో పాటు గనుల శాఖల్లో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, ఆ శాఖల్లో కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ పన్ను వసూళ్లపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చించారు. పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని సీఎం ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకు పైగా చెల్లించేదని, ఆ గడువు ముగియడంతో నిధులు రావట్లేదని రాబడిలో వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మద్యం సరఫరా వాహనాలకు అవి ఉండాల్సిందే
మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించిన లెక్కల్లో తేడాలు ఉంటున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రతీ డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్ అమర్చి వాటిని ట్రాకింగ్ చేయాలని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాలని, మద్యం సరఫరా వాహనాలు వే బిల్లులు కచ్చితంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పాటు గతంలో నమోదు చేసిన పలు కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో తమ శాఖలోనూ అదే పరిస్థితి నెలకొందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం
అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులపై కంకర కుప్పలుగా పోసి విక్రయి స్తున్నారని, అలా కాకుండా నగరంలో వివిధ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాలను అందుకు వినియోగించాలని సూచించారు. ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని సీఎం ఆదేశించారు. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వకూడదని సీఎం రేవంత్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి నందుకుగానూ పలు గనులపై గతంలో జరిమానాలు విధించారని, కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. గతంలో జరిమానాలు విధించి తర్వాత వాటిని తగ్గించారని, అందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, దానిపై నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >