| Daily భారత్
Logo




గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్

News

Posted on 2024-02-26 15:43:17

Share: Share


గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్

డైలీ భారత్, మహబూబాబాద్: గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ తెలిపారు.

సోమవారం ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అధికారులు గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు సమాధానం తెలుపాలని అన్నారు.

ఈ సందర్బంగా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన తాళ్ల సోమలక్ష్మి గ్రామంలోని తనకు చెందిన భూమి సర్వే నెం.110,111,112 గల మిగులు భూమి వేరే ఇతర వ్యక్తులు తమ పేర్లపై నమోదు చేసుకున్నారని రీ సర్వే చేసి తన భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇవ్వాలని కోరారు.

తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన డొనుక సౌజన్య, తను వికాలంగురాలినని హైదరాబాద్ మెడికల్ బోర్డు ద్వారా జారీ చేసిన తన అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నందున, వికాలాంగులకు ఇచ్చే ఫించను లో నమోదు చేసి తనకు లభ్ది చేకూర్చాలని కోరారు.

ఇరుగు వెంకటేష్,కప్పల సాయికిరణ్ షెడ్యుల్డ్ కులాల హాస్టల్ నందు గత 8 నెలల నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నా తమకు జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని జీతాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ళ స్థలాలలో ఇళ్ళ నిర్మాణం చేపడుతుంటే ఇతర వ్యక్తులు అడ్డుకుని ఇళ్ళ నిర్మాణం లో అడ్డు తగులుతున్నారని ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో (76) దరఖాస్తులను  వివిధ శాఖల అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమాదేవి, సిపిఓ సుబ్బారావు,  జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >