| Daily భారత్
Logo




జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు హర్షణీయం : జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

News

Posted on 2024-02-25 06:50:00

Share: Share


జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు హర్షణీయం : జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిఒ 317 ద్వారా అమలు జరిపిన ఉద్యోగుల విభజనలో ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం జిఒ 292 ద్వారా  వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ( టిఎస్ యుటిఎఫ్) స్వాగతిస్తున్నది. 

రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 అమలులో భాగంగా ఉద్యోగుల శాశ్వత కెటాయింపు కోసం  గత ప్రభుత్వం 2021 డిసెంబర్ 6 న జిఒ 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. క్యాడర్ లో జూనియర్ అయినందుకే స్వంత జిల్లాలను వదిలి పరాయి జిల్లాకు కెటాయించబడ్డారు. భార్యా భర్తలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు. పూర్వపు సర్వీసును వదులుకుని అంతర్జిల్లా బదిలీ ద్వారా వచ్చిన భార్యా భర్తలు కూడా తిరిగి వేరు చేయబడ్డారు. నిబంధనల ప్రకారం భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాల్సి ఉండగా 19 జిల్లాల్లో అనుమతించి 13 జిల్లాలను బ్లాక్ చేశారు. 

స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు, విడిపోయిన భార్యాభర్తలకు న్యాయం చేయాలని కోరుతూ గత రెండు సంవత్సరాలుగా టిఎస్ యుటిఎఫ్, యుయస్పిసి, ఆయా ఫోరమ్ లు నిర్వహించిన ప్రాతినిధ్యాలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పోరాటాలను నిరంకుశంగా అణచివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధరబాబు గారికి టిఎస్ యుటిఎఫ్ పక్షాన సమస్యను కూలంకషంగా వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిఒ 317 ద్వారా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కారం చేస్తామని మానిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ మేరకు ఈరోజు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం ఒక ముందడుగు. టిఎస్ యుటిఎఫ్ పక్షాన హర్షం ప్రకటిస్తున్నాము.

జిఒ 317 అమలు కారణంగా ఉత్పన్నమైన సమస్యలను ఉపసంఘం అధ్యయనం చేసి సత్వరమే సానుకూల పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము.


పాకాల శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు, 

గుండమనేని మహేందర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి, 

అంబటి రమేష్, లత 

జిల్లా ఉపాధ్యక్షులు

పర్కాల రవీందర్

జిల్లా కోశాధికారి

వంగ మల్లేశం

జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్

జిల్లా కార్యదర్శులు

మల్లేశం, శివకుమార్, స్వామి, రాజు భాస్కర్,ప్రవీణ్, తిరుపతి, సరిత

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >