| Daily భారత్
Logo




తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు

News

Posted on 2024-02-24 17:12:01

Share: Share


తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు

రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు

ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు

ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు.

డైలీ భారత్, తెలంగాణ: రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను నిర్మించనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తిచేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వేశాఖ మొత్తం రూ.2,245 కోట్ల నిధులను కేటాయించింది. 

2023 ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర సహకరిస్తుండటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వేల రూపురేఖలను సమూలంగా మార్చివేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

అమృత్ భారత్ స్టేషన్లు కేటాయించిన నిధులు

జడ్చర్ల రూ.10.94 కోట్లు

గద్వాల్ రూ.9.49 కోట్లు

షాద్ నగర్ రూ.9.59 కోట్లు

మేడ్చల్ రూ.8.37 కోట్లు

మెదక్ రూ.15.31 కోట్లు

ఉందా నగర్ రూ.12.37 కోట్లు

బాసర రూ.11.33 కోట్లు

యాకుత్ పుర రూ.8.53 కోట్లు

మిర్యాలగూడ రూ.9.50 కోట్లు

నల్గొండ రూ.9.50 కోట్లు

వికారాబాద్ రూ.24.35 కోట్లు

పెద్దపల్లి రూ.26.49 కోట్లు

మంచిర్యాల రూ.26.49 కోట్లు

వరంగల్ రూ.25.41 కోట్లు

బేగంపేట రూ.22.57 కోట్లు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >