డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవల తాటికొండ రాజయ్య రాజీనామా చేయగా.. తాజాగా మరో యువనేత పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ప్రణయ్ భాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. తనకు విలువ లేనిచోట ఉండలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా గురువారం అభినవ్ భాస్కర్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.
News
పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్ యువ నేత