డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రెరా సెక్రటరీ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. అక్రమ ఆస్తులపై 8 రోజుల పాటు బాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ.. ఇవాళ్టితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా బాలకృష్ణ 8 రోజుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. శివబాలకృష్ణ బినామీల పేరిట 214 ఎకరాల భూమి గుర్తించినట్లు తెలిపారు. బాలకష్ణ పేరిట 7 ఇళ్లు, ఒక విల్లా గుర్తించామన్నారు. ఆయనకు మొత్తం రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. శివబాలకృష్ణకు ప్రధానంగా ముగ్గురు బినామీలు ఉన్నారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల పేరిట 29 ప్లాట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ శివబాలకృష్ణ సోదరుడు నవీన్‌ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. శివబాలకృష్ణ కేసులో సంబంధం ఉన్న అధికారుల పాత్రపైన ఆరా తీస్తున్నామని తెలిపారు.
News
ముగిసిన బాలకృష్ణ కస్టడీ.....ఎసిబి విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు