| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ సీఎం తో ఇస్రో చైర్మన్ భేటీ

తెలంగాణ సీఎం తో ఇస్రో చైర్మన్ భేటీ

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ భేటీ అయ్యారు. బుధవారం సచివాలయానికి వచ్చిన సోమనాథ్ సీఎంతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ ఎస్సీ,తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాత్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

అంతకు ముందు సచివాలయానికి వచ్చిన ఇస్రో చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు ప్రభుత్వ ఉన్నతా ధికారులు, ఇస్రో అధికా రులు ఉన్నారు

Previous కృష్ణా జలాలపై కేసీఆర్ ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదం : మంత్రి జూపల్లి కృష్ణారావు
Next రోడ్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రికి వినతి పత్రం అందచేసిన భీమ్ భరత్
ADVERTISEMENT