| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గురుకుల పాఠశాలకి పక్కా భవనం నిర్మించాలి-మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు

గురుకుల పాఠశాలకి పక్కా భవనం నిర్మించాలి-మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు సిరిసిల్ల పట్టణ బాలుర గురుకుల పాఠశాలను టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి సందర్శించి విద్యార్థులను, స్పెషల్ ఆఫీసర్(SO) లింగంపెళ్లి రాములుని సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. 2017 సంవత్సరం నుంచి ఇట్టి గురుకుల పాఠశాలకి పక్కా భవనం లేకపోవడంతో అద్దె భవనంలో  తరగతులను నిర్వహించడం వలన కనీస సౌకర్యాలు లేక దాదాపు100 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గురుకుల పాఠశాలాలకు పక్కా భవనాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శ్యాగ ప్రశాంత్ పాల్గొన్నారు..

Previous నిరసనలో నిరసనలు
Next సాధారణ భక్తులకు దర్శన ఇబ్బందులు దూరం చేసేందుకు... తిరుమల తరహాలో విఐపి బ్రేక్ దర్శనం
ADVERTISEMENT