డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసనకు నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తొలుత రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతుండగానే యూత్ కాంగ్రెస్ నాయకులు బల్క సుమన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మీడియాతో మాట్లాడే నాయకుల విషయంలో కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ నేతల్లో జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి "నిరసన" కాంగ్రెస్ నాయకులు మధ్యనే నిరసనలకు దారి తీయడం కొసమెరుపు...
News
నిరసనలో నిరసనలు