| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో చేనేత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ట్రాక్టర్ పై మగ్గాన్ని ఏర్పాటు చేసి, శోభాయాత్ర కొనసాగుతుండగానే చీర నేస్తూ పాల్గొన్నారు. కదులుతున్న ట్రాక్టర్ పైనే నేత నేయడం చూసి భక్తులు, ప్రజలు ఆశ్చర్యపోయారు.

శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చిన వారంతా మగ్గం వద్ద ఆగి ఆయన పనితీరును ఆసక్తిగా తిలకించారు. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని, స్థానిక చేనేత సంప్రదాయ గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది.

వెల్ది హరిప్రసాద్ చేసిన ఈ వినూత్న ప్రయోగం శోభాయాత్రలో సందడి నెలకొల్పింది.

Previous నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Next ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష
ADVERTISEMENT