డైలీ భారత్, నిజామాబాద్: ప్రజల మంచికోరి చేసిన చట్టంతో ప్రజలతో రాక్షస క్రీడ ఆడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకపు లావాదేవీలు ఆపడమంటే ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాచి వేయడమేనని అన్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 (ఎ )ఏ భూమినైనా నిషేధిత జాబితాలో చేర్చే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిందని కాని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వలాభమే కాంగ్రెస్ విధానంగా మారిందని ఆయన ఆరోపించారు. భూ క్రయ విక్రయాలతోని ప్రభుత్వానికి లాభం రావలసిన చోట ప్రభుత్వ ఖాజానకు కన్నం వేస్తూ కాంగ్రెస్ ఖాజానా నిండితే చాలానే తీరుగా రేవంత్ ప్రభుత్వ నడవడిక ఉందని మధుసుధన్ రావు దెప్పి పొడిచారు. ప్రజల ఆర్థిక స్థితిగతులతో ఆటాలాడుకునే కాంగ్రెస్ నైజంకు ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆర్థిక ప్రగతికి అనువుగా ఉండి తద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు వేసే భూముల అమ్మకం కొనుగోలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నిషేధిత భూముల కోసమంటు ప్రయోగించిన సెక్షన్ 22(ఎ ) వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News
నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"