| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్

"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్

డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద BJYM ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు.

BJYM రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా రాగుల రాజిరెడ్డి మాట్లాడుతూ - ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు నిలిపివేయడంతో విద్యార్థులు పైచదువులు, ఉద్యోగాలకు వెళ్లలేక మానసికంగా కుంగిపోతున్నారన్నారు.

"ఫీజుల బకాయి - బీజేపీ లడాయి" అంటూ విద్యార్థుల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని, ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు, BJYM స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింక అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు చింతలటానా నరేష్, చిందం నరేష్, జితేందర్ రెడ్డి, సిరిసిల్ల వంశీ, మారవేణి రంజిత్, ఏరా అరవింద్, కోల ఆంజనేయులు, సూరం వినయ్, శ్రావణపల్లి ప్రశాంత్, పట్టణ నాయకులు సాయి దీప్, కృష్ణ, అభి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Previous నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"
Next అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
ADVERTISEMENT