| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్

అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR రెండవ విడత ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC) అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

తంగళ్లపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన SIR గ్రామసభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... SIR రెండవ విడతలో నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును నిరూపించుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను బూత్ లెవల్ ఆఫీసర్లకు (BLO) అందజేయాలని, ఆ విషయాన్ని బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) ఓటర్లకు గుర్తుచేయాలని సూచించారు.

గైర్హాజరు ఓటర్లు, చిరునామా మారిన ఓటర్లు, ఒకటికి మించి ఓట్లు నమోదైన వారు, మరణించిన వారి ఓట్ల తొలగింపు వంటి అంశాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి BLAలు BLOలకు అందించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు తమ విలువైన ఓటు హక్కును కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLAలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

#SangeethamSrinivas #Sircilla #Tangallapalli #SIR2026

Previous "ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Next హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
ADVERTISEMENT