డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్టును ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద TRSV ఆధ్వర్యంలో నిరసన జరిగింది.
TRSV రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ "పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న మా నాయకుడు హరీశ్ రావును అరెస్ట్ చేయడం దుర్మార్గం. విద్యార్థులకు అండగా వెళ్తే అరెస్టా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు. GO 97 ను వెంటనే రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, అరెస్ట్ చేసిన హరీశ్ రావును వెంటనే విడుదల చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్, అబ్బి, రిషి, మధు, రాజు, శ్రీనివాస్, మహేష్, నవీన్, అనిల్, శశి, సాయి తదితరులు పాల్గొన్నారు.