తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్
డైలీ భారత్, కామారెడ్డి : తెలంగాణ సాహితీ ముద్దు బిడ్డ సినారె సాహిత్యం ఆదర్శనీయమని సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలో రచనలు చేసి ఆదర్శ సాహితీ వేత్త గా నిల్చాడని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి సాహితీ వేత్త. కందుకూరి శ్రీనివాస్ అన్నారు.
బుధవారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యం లో ఙ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత డా సి నారాయణ రెడ్డి జయంతిని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనం లో ఘనం గా నిర్వహించారు..
ఈ సందర్భం గా వక్తలు మాడ్లాడుతూ
సి నా రె. సాహిత్యం పై ఎన్నో పరిశోధనలు జరిగాయని అన్నారు. విశిష్ట అతిథి ప్రముఖ వ్యాఖ్యాత ఉపాధ్యాయ సంఘ నాయకులు అంభీర్ మనోహర్ మాట్లాడుతూ
గజల్ పాట కవిత్వం లాంటి అన్ని ప్రక్రియల్లో సాధన చేసి న మహనీయుడు సినారె మన ప్రాంత మహా కవి కావడం గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమం లో కవి సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో విశిష్ట అతిథి ప్రముఖ వ్యాఖ్యాత అంభీర్ మనోహర్ బి నాగభూషణం తెరవే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గఫూర్ శిక్షక్ మోహన్ రాజ్ ప్రతినిధులు కాసర్ల రామచంద్రం కాశ నర్సయ్య తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు..