| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్

రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్

డైలీ భారత్, హైదరాబాద్:న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కిన ఒక మహిళకు రక్షణకు బదులు ద్రోహం ఎదురైంది.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ, బాధితురాలి సమస్యను పరిష్కరిస్తానని నమ్మకం కలిగించి, ఆమెను లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా సన్నిహిత వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. పోలీస్ శాఖ పరువుకు మచ్చ తెచ్చినందుకు కమిషనర్ V.C. సజ్జనార్ సదరు సీఐని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

"అధికారాన్ని అడ్డంగా వాడిన ఎవరినీ వదిలిపెట్టం" అని CP స్పష్టం చేశారు. 

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

Previous కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Next విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
ADVERTISEMENT