| Daily భారత్
Logo




టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

News

Posted on 2026-07-14 13:24:05

Share: Share


టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

టింబర్ సంఘ భవన నిధుల కోసం హామీ 

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా  సామిల్ టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాజిద్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కట్టె కోత మిషన్ల యజమానుల సంఘానికి సంఘ భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని ప్రభుత్వ సలహాదారులు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా సామిల్ టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా వాజిద్ జషీన్ ను, టింబర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ సన్మానించారు. స్థలం చూపితే భవన నిర్మాణానికి కృషి చేస్తానని నిధులు మంజూరు చేస్తానని 

సామిల్  యజమానులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హామీ ఇచ్చారు. కట్టెకోత మిల్లుల యజమానుల సంఘ సమస్యల పరిష్కరించడానికి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరింప చేస్తానని సంఘ ప్రతినిధులకు షబ్బీర్ భరోసా ఇచ్చారు. సా మిల్  యజమానులు ప్రభుత్వం నిబంధనల మేరకు నడుచుకోవాలని సంఘ ప్రతినిధులకు ప్రభుత్వ సలహాదారులు సూచించారు. కామారెడ్డి జిల్లాలో 55 మంది టింబర్ మర్చంట్ లు ఉన్నారని వారి సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వంతో మాట్లాడాలని, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేయాలని సామి యజమానులు  షబ్బీర్ కు విన్నవించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి దోమకొండ బాన్సువాడ బిచ్కుంద ప్రాంతాలలో టింబర్ మర్చంట్ల సమస్యలు ఉన్నాయని వాటిని  పరిష్కరింపజేయాలని ప్రభుత్వానికి, ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్ ను  సామిల్లుల యజమానులు కోరారు. తనను కామారెడ్డి టింబర్ మర్చంట్ల సంఘ అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు వాజిద్ జిల్లాలోని సామిల్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ సన్మానించిన వారిలో కామారెడ్డి జిల్లా టింబర్ మర్చంట్ల సంఘం అధ్యక్షులు వాజిద్ జషీన్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు నవీద్, కోశాధికారి తమీమ్ అహ్మద్, ఉపాధ్యక్షులు సందీప్ కుమార్, ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఆజం ఖాన్, శ్రీధర్, కాంతిలాల్ పటేల్, సలహాదారులు బి సుదర్శన్ తదితరులు ఉన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >