| Daily భారత్
Logo




రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

News

Posted on 2026-07-14 09:33:44

Share: Share


రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

డైలీ భారత్, పెద్దపల్లి: మున్సిపల్ పనుల బిల్లులు ఇప్పించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ అధికారి ACB కి చిక్కాడు.

పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీశ్, మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు అందుకున్న ACB DSP మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్లాన్ తో ట్రాప్ ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం సతీశ్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం AE సతీశ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

పెద్దపల్లిలో పెరుగుతున్న ACB కేసులు

ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై ACB ఉక్కుపాదం మోపుతోంది. గత ఏడాది జూలైలో పంచాయతీ రాజ్ AE పి. జగదీష్ బాబు రూ. 90 వేలు, ఫిబ్రవరిలో మంథని సబ్ రిజిస్ట్రార్ రూ. 16,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ప్రజలకు ACB విజ్ఞప్తి

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే భయపడకుండా వెంటనే ACB కి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. 

టోల్ ఫ్రీ: 1064 

వాట్సాప్: 94404 46106

ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB స్పష్టం చేసింది.


Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >