| Daily భారత్
Logo




రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

News

Posted on 2026-07-13 15:55:48

Share: Share


రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

రూ.25 లక్షల మోసంపై సమగ్ర విచారణకు డిమాండ్ : గిరిజన మహిళా

డైలీ భారత్, మరిపెడ బంగ్లా: పరకాజలాల్ తండాకు చెందిన గిరిజన మహిళ నేతావత్ యాకమ్మ, ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల నివేదికలను నమ్మి రూ.25 లక్షలు పోగొట్టుకుని న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, 2024 జూలైలో మరిపెడ బంగ్లా హనీ హోటల్ వెనుక ఉన్న సర్వే నం.288/E/3లోని 20 గుంటల భూమిని ఇల్లు నిర్మించుకునేందుకు ఒక్కో గుంటకు రూ.2.85 లక్షల చొప్పున భూ యజమానులైన షేక్ అయూబ్, హఫీజాల వద్ద కొనుగోలు చేయాలని నిర్ణయించి దశలవారీగా సుమారు రూ.25 లక్షలు చెల్లించారు. అనంతరం ఆ భూమి చెరువు FTL/బఫర్ జోన్ పరిధిలో ఉందనే అనుమానం రావడంతో సంబంధిత అధికారులను సంప్రదించగా, రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు ఆ భూమికి ఎలాంటి అభ్యంతరం లేదని, నిర్మాణానికి ఇబ్బంది లేదని నివేదికలు ఇచ్చాయని, ఆ నివేదికలను నమ్మి డబ్బులు చెల్లించానని ఆమె తెలిపారు. అయితే 2026 జూన్ 1న రిజిస్ట్రేషన్‌కు ముందు మరోసారి ఇరిగేషన్ అధికారులను కలవగా మొదట భూమికి ఎలాంటి సమస్య లేదని చెప్పి, మరుసటి రోజే అదే భూమి పూర్తిగా FTL/బఫర్ జోన్ పరిధిలో ఉందని చెప్పడంతో తాను తీవ్రంగా మోసపోయానని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించగా రీ-సర్వేకు ఆదేశాలు జారీ చేశారని, 2026 జూలై 10న అధికారులు సర్వేకు రాగా భూ యజమానులు దానిని అడ్డుకోవడమే కాకుండా, తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరించారని ఆమె ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం, పరస్పర విరుద్ధమైన నివేదికలు, భూ యజమానుల వ్యవహారశైలి కారణంగా తాను తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభకు గురయ్యానని, కష్టపడి కూడబెట్టుకున్న రూ.25 లక్షలు వడ్డీతో తిరిగి ఇప్పించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు నేతావత్ యాకమ్మ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులను వేడుకున్నారు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >