Posted on 2026-07-12 16:40:00
కార్యాలయం ప్రారంభం... 200 మంది చేరిక
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జనసేన పార్టీ జోష్ పెరిగింది. చుంచుపల్లి మండలం శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అమరవీరుల స్థూపం మరియు డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర ఇంచార్జి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు. వారి సమక్షంలో 200 మంది యువకులు, మహిళలు పార్టీ కండువాలు కప్పుకుని జనసేనలో చేరారు.
గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ...
"నేను కొత్తగూడెంలోనే పుట్టి పెరిగాను. ప్రజా సేవ చేయడానికే ఈ పార్టీలో చేరాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏమి చేయాలో తెలిసిన నాయకుడు. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు ముందుకు వచ్చాను. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఏమీ చేయలేదు. రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో జనసేన తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగి అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
రామ్ తాళ్లూరి మాట్లాడుతూ...
"పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేస్తాను. సామాజిక తెలంగాణ సాధ్యమయ్యేది జనసేనతోనే. BC ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ మాదే. BRS దళిత CM వాగ్దానం మాటలుగానే మిగిలిపోయింది" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాము యాదవ్, టి. శ్రీనివాసరావు, సినీనటుడు తనీష్, హసీనా, జయశ్రీ, ఖమ్మం జిల్లా ఇంచార్జి మిర్యాల రామకృష్ణ, నరేష్, సాదిక్ తో పాటు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >