| Daily భారత్
Logo




ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

News

Posted on 2026-07-11 17:25:49

Share: Share


ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

డైలీ భారత్ డెస్క్: దిగ్గజ సింగర్ ఎస్.జానకి(88) తుదిశ్వాస విడిచారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న జానకి.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగర్ జానకి మనవరాలు ఇన్‌స్టా పోస్ట్‌తో ఈ విషయాన్ని తెలియజేశారు. తమకు ఎంతో ఇష్టమైన గాయని శివైక్యం చెందడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.ఎస్ జానకి పూర్తి పేరు శిష్టా జానకి. ఏప్రిల్ 23, 1938 గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, శకుంతలమ్మ. భర్త వి. రామ్‌ప్రసాద్ 1992లో మరణించారు. వీరికి మురళీకృష్ణ అనే ఒక కుమారుడు ఉన్నారు. 1957లో విడుదలైన "విధియిన్ విలయాడల్" అనే తమిళ చిత్రం ద్వారా ఆమె గాయనిగా పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి పాట "ఎమ్మెల్యే" (1957) చిత్రంలోని "నీ ఆశ అడియాస పాయెనే మోసమాయెనే". తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17కు పైగా భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 48,000 కంటే ఎక్కువ పాటలను ఆలపించారు.

ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు (16 వయతినిలే - తమిళం, శంకరాభరణం - తెలుగు, ఏరి పీలక్కూ ఒరు కూడు - మలయాళం, సీతకోకచిలుక - తెలుగు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 కి పైగా నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుండి 14 సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుండి 7 సార్లు రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 2013 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "పద్మభూషణ్" అవార్డును ఆమె తిరస్కరించారు. దశాబ్దాల సేవకు గానూ తనకు చాలా ఆలస్యంగా ఈ అవార్డు ఇచ్చారని, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >