Posted on 2026-07-11 15:49:13
రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం
జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ
డైలీ భారత్, కామారెడ్డి : విశ్వసనీయ సమాచారం మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్కల్ గ్రామంలో ఈరోజు బిచ్కుంద ఎస్‌ఐ రాజు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో జూదం, పేకాట, బెట్టింగ్, అక్రమ మద్యం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా, కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిని దెబ్బతీసి, సమాజంలో నేరాల పెరుగుదలకు దారితీస్తాయి" అని జిల్లా ఎస్పీ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు.
జూదానికి బానిసై నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని, కష్టపడి సంపాదించే సరైన మార్గాన్ని ఎంచుకొని మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని జిల్లా ఎస్పీ సూచించారు.
జూదం, బెట్టింగ్ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >