| Daily భారత్
Logo




షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

News

Posted on 2026-07-11 13:46:16

Share: Share


షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాబాద్ ఆరు హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్‌కుమార్‌పై ఫైల్ అయిన ఎఫ్ఐఆర్‌లోని వివరాల మేరకు.. నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే ఓ కేసు ఉంది. భూతగాదాలో రాజ్‌కుమార్ ఇద్దరిని కొట్టి బెదిరించాడు. షాబాద్ పీఎస్‌లోనే రాజ్‌కుమార్‌పై కేసు నమోదైంది. బాలిక విషయంలోనూ రాజ్‌‌కుమార్ క్రూరంగా వ్యవహరించాడు. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. మాట్లాడాలని, కలవాలని టార్చర్ పెట్టాడు.

శంషాబాద్‌లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ బాలికను వేధింపులకు గురిచేశాడు. బాలిక తల్లి రాజ్‌కుమార్‌ భయంతో బాలికను కాలేజీకి పంపటం ఆపేసింది. అయితే, పరీక్షల సమయంలో తప్పనిసరై బాలికను కాలేజీ దగ్గరకు తీసుకెళ్లింది. పరీక్ష తర్వాత రాజ్‌‌కుమార్ బాలికను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. బాలిక తల్లి రాజ్‌కుమార్‌ను అడ్డుకుని బాలికను తప్పించింది. ఈ నేపథ్యంలోనే రాజ్‌కుమార్ బెదిరింపులకు దిగాడు. బాలిక తండ్రిని చంపినట్టే అందరినీ చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. రాజ్‌కుమార్ నుంచి తమను కాపాడాలని బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.

రాజ్‌కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. శనివారం రాత్రి బాలికతో పాటు ఆమె తల్లి, నాన్నమ్మను చంపేశాడు. ఆ తర్వాత సొంత భార్యాపిల్లలను కూడా హత్య చేశాడు. హత్యల నేపథ్యంలో బాలిక బంధువులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. హత్యలకు పోలీసుల అలసత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. మే 16వ తేదీన రాజ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశామని బాలిక కుటుంబసభ్యులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. రాజ్‌కుమార్ బయటే తిరుగుతూ చాలా సార్లు బెదిరించాడని చెబుతున్నారు..

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >