| Daily భారత్
Logo




స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

News

Posted on 2026-06-20 20:26:39

Share: Share


స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి జూపార్క్‌గా రికార్డు

తెలంగాణ అటవీ శాఖకు మంత్రి కొండా సురేఖ అభినందనలు

డైలీ భారత్, న్యూఢిల్లీ/ హైదరాబాద్: అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న కృషికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మౌస్ డీర్ (Mouse Deer) సంరక్షణ, బ్రీడింగ్ మరియు అడవుల్లోకి పునరావాసం (Conservation Breeding & Reintroduction) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రతిష్టాత్మక స్కాచ్ (SKOCH) అవార్డును అందుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్క్‌గా నెహ్రూ జూలాజికల్ పార్క్ నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమలో భాగంగా అందించే ఈ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీ లో జరిగింది.. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ వసంత ఈ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అటవీ దళాల అధిపతి (PCCF & HoFF) డా. సీ. సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లే ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధ్యమైందన్నారు. అలాగే మౌస్ డీర్ సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జూ సిబ్బంది, సాంకేతిక బృందం, సహచర ఉద్యోగుల కృషిని ఆమె అభినందించారు.

ఈ అవార్డు లభించడం పట్ల జూ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియలో సహకరించి, తమకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జూ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (PCCF) వినయ్ కుమార్ మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వినూత్న సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు.

ఈ అవార్డు సాధించిన నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు, సిబ్బందితో పాటు తెలంగాణ అటవీ శాఖను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు సాధించాలని ఆకాంక్షించారు.

Image 1

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On 2026-06-21 13:42:34

Readmore >
Image 1

ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటి

Posted On 2026-06-21 13:41:41

Readmore >
Image 1

కేంద్రం కీలక నిర్ణయం... 16 డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం..

Posted On 2026-06-21 11:35:39

Readmore >
Image 1

కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ బస్సులో మంటలు

Posted On 2026-06-21 10:47:39

Readmore >
Image 1

పాఠశాల బ్యాగ్ బరువు –పిల్లల ఆరోగ్యంపై భారం కాకూడదు

Posted On 2026-06-21 07:53:34

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-06-20 20:28:48

Readmore >
Image 1

స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

Posted On 2026-06-20 20:26:39

Readmore >
Image 1

జడ్‌పీహెచ్‌ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-20 19:32:50

Readmore >
Image 1

ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక

Posted On 2026-06-20 19:30:39

Readmore >
Image 1

40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

Posted On 2026-06-20 19:13:51

Readmore >