Posted on 2026-06-18 17:15:26
నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందుతుడైన తండ్రికి 04 సం.జైలు శిక్ష,రు. 2000/- జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
జిల్లా పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై తండ్రి లైగింక వేదింపులకు గురి చేయగా బాధితురాలి తల్లి ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి అప్పటి దర్యాప్తు అధికారి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ కి తరలించి,కోర్టులో చార్జిషీట్ ఫైల్ చెయడం జరిగింది.
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్,కోర్ట్ మానిటరింగ్ కానిస్టేబుళ్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 08 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్ వాదించగా సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడికి O4 సంవత్సరాలు జైలు శిక్ష , 2000/-జరిమాన విధించారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని,శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ,న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈకేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను, పిపిలను, కోర్ట్ కానిస్టేబుళ్లను, కోర్టు మానిటరింగ్ అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >