| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?

సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయంటే సామాన్యులు చేస్తున్నారని అనుకుంటాం. కానీ ఇక్కడ ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

పాల్వంచ నవభారత్ పరిధిలోని కలెక్టరేట్ కి కూతవేటు దూరం లో ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్ 444కు చెందిన ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.  ఓ కార్పొరేటర్ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు..

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు సహకరిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? సర్వే నెం 444లో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Previous అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్
Next మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్
ADVERTISEMENT