| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

డైలీ భారత్, సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఎవరు ప్రాణాలు పోకూడదు ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఎస్పి నర్సింహా ఐపీఎస్ గారు సూచించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రోడ్డు నివారించడంలో పోలీసు అనుక్షణం కృషి చేస్తున్నాం అని తెలిపారు. సూర్యాపేట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ తరపున సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో హెల్మెట్ పంపిణీ చేశారు. సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి అంశాలు, పోలీసు కార్యకలాపాలు, శాఖల కార్యకలాపాలు ఇతర అంశాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు, సమాజానికి చేరవేయడంలో జర్నలిస్టులు అనుక్షణం పనిచేస్తున్నారని అన్నారు. ఎండ వాన చలి అనక పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో ప్రధాన రక్షణ పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ అధికారి మల్లేష్, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు

Previous సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Next పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
ADVERTISEMENT